ETV Bharat / state

హన్మకొండలో విద్యుత్​ ఉద్యోగుల ఆందోళన - వరంగల్​ అర్బన్​ జిల్లా

కేంద్ర ప్రభుత్వ విద్యుత్​ సవరణ బిల్లు 2020 వెంటనే నిలిపి వేయాలని వరంగల్​ అర్బన్​ జిల్లా కేంద్రంలో విద్యుత్​ ఉద్యోగులు ఆందోళన చేపట్టారు. దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చిన క్రమంలో హన్మకొండలోని విద్యుత్​ భవన్​ ముందు ఉద్యోగులు నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలియజేశారు.

Electricity Employs Protest On Central Electricity Bill 2020
హన్మకొండలో విద్యుత్​ ఉద్యోగుల ఆందోళన
author img

By

Published : Jun 1, 2020, 8:06 PM IST

వరంగల్​ అర్బన్​ జిల్లా కేంద్రంలో విద్యుత్​ ఉద్యోగులు ఆందోళన చేపట్టారు. కేంద్ర ప్రభుత్వ విద్యుత్​ సవరణ బిల్లు 2020ని వ్యతిరేఖిస్తూ.. దేశవ్యాప్తంగా ఇచ్చిన పిలుపులో భాగంగా జిల్లా కేంద్రంలో నిరసన కార్యక్రమం చేపట్టినట్టు కార్మికులు తెలిపారు. కేంద్ర ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ.. విద్యుత్​ ఉద్యోగులు నల్ల బ్యాడ్జీలు ధరించి హన్మకొండలోని విద్యుత్​ భవన్​ ముందు నిరసన చేపట్టారు.

విద్యుత్​ సవరణ బిల్లును తక్షణమే నిలిపివేయాలని డిమాండ్​ చేస్తూ.. నినాదాలు చేశారు. విద్యుత్​ రంగంలో ప్రైవేట్​ కంపెనీలను ఆహ్వానించడం.. దోపిడికి దారులు వేసినట్టే అని ఆరోపించారు. విద్యుత్​ సవరణ బిల్లు వల్ల పేదలు నష్టపోతారని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం బిల్లును వెనక్కి తీసుకోకపోతే.. ఆందోళనను ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.

ఇవీ చూడండి: విజృంభిస్తున్న కరోనా... ఆగమంటే ఆగేనా

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.