EC Notice Warangal Trs Leader: వరంగల్ నగరంలో దసరా పండుగ రోజున తెరాస నేత రాజనాల శ్రీహరి మద్యం, కోళ్లను పంపిణీ చేసిన సంఘటనపై ఎన్నికల కమిషన్ స్పందించింది. ప్రభాకర్ అనే వ్యక్తి ఫిర్యాదు మేరకు రాజనాల శ్రీహరికి ఈసీ నోటీసులు జారీ చేసింది. విజయదశమి పండుగ వేళ వరంగల్‌కు చెందిన తెరాస నేత రాజనాల శ్రీహరి 200మంది హమాలీలకు మద్యం, కోళ్లను అందజేసిన విషయం తెలిసిందే.
ముఖ్యమంత్రి కేసీఆర్ నూతనంగా ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ దేశంలో తిరుగులేని పార్టీగా నిలవాలని.. అదేవిధంగా మునుగోడు ఎన్నికల్లో తెరాస అభ్యర్థి భారీ మెజార్టీతో గెలుస్తారని అంటూ వ్యాఖ్యలు చేశారు. దీనిపై ప్రభాకర్ అనే వ్యక్తి ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. మునుగోడు అభ్యర్థి గెలుపుపై వ్యాఖ్యానించడం ఎన్నికల నియమావళికి విరుద్ధమని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో ఎన్నికల సంఘం రాజనాల శ్రీహరికి నోటీసులు అందజేశారు.
ఈసీ నోటీసులపై రాజనాల శ్రీహరి స్పందించారు. తాను వరంగల్‌లో మద్యం, కోళ్లను పంపిణీ చేశానని.. మునుగోడులో ఓటర్లను మభ్యపెట్టలేదని వివరణ ఇచ్చారు. కొంతమంది నాయకులు కావాలనే తన ఎదుగుదలను చూసి ఓర్వలేక ఇలాంటి కుట్రలకు పాల్పడుతున్నారని శ్రీహరి ఆరోపించారు.
ఇవీ చదవండి: తెరాసను గెలిపిస్తే మునుగోడు నియోజకవర్గాన్ని దత్తత తీసుకుంటా: కేటీఆర్
అటెండర్‌గా పనిచేసిన కాలేజీకి అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా.. డ్యూటీ చేస్తూనే చదువుతూ..