వరంగల్‌కు చెందిన రవిచంద్ర, కిశోర్ అనే ఇద్దరు మిత్రులు 30 రోజులుగా నిత్యం 300 మంది వలస కార్మికులకు, అభ్యాగ్యులకు భోజనం పంపిణీ చేస్తున్నారు. ఇంటి వద్ద అన్నం వండుకొని వచ్చి హన్మకొండలోని వలస కూలీలకు పెడుతూ వారి ఆకలి తీరుస్తున్నారు. కార్మికులకు, అభాగ్యులకు తమ వంతు సాయమందించాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు వారు తెలిపారు.
ఇదీ చూడండి: నిర్మాణ రంగానికి పూర్తి సహకారం అందిస్తాం : సోమేష్ కుమార్