రూ. 360 కోట్లతో ఆడపడుచులకు బతుకమ్మ చీరలను పంపిణీ చేస్తున్నామని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలోని అంబేడ్కర్ భవనంలో స్థానిక ఎమ్మెల్యే వినయ్భాస్కర్తో కలిసి ఆయన చీరలను పంపిణీ చేశారు. ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా కేసీఆర్ మహిళలకు బతుకమ్మ కానుకగా చీరలను అందజేస్తున్నారని కొనియాడారు. ఆంధ్ర పాలనలో బతుకమ్మ పండుగకు ప్రాధాన్యత ఇవ్వలేదని గుర్తు చేశారు. తెలంగాణ జాగృతిని ప్రారంభించి బతుకమ్మను విదేశాలలో కూడా ఆడే విధంగా చేసిన ఘనత కవితదని కొనియాడారు.
ఇదీ చూడండి : మహానగరంలో సీజన్ మొత్తంలోనే అత్యధిక వర్షపాతం నమోదు