వరంగల్ నగరంలో అధ్వానంగా మారి గుంతలు తేలిన రోడ్లపై యూత్ కాంగ్రెస్ వినూత్నంగా నిరసన చేపట్టింది. హన్మకొండలోని బస్టాండ్ వద్దనున్న రోడ్డుపై చేపలు పడుతూ నిరసనకు దిగారు. ప్రమాదకరంగా మారిన గుంతలపై అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోవట్లేదని ఆరోపించారు. ఏడాదికి రూ.300 కోట్ల నిధులు వస్తున్నా రహదారుల మరమ్మతులు చేయించనందుకు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇదీ చదవండిః మృత్యు మార్గం: 'జాతర' కోసం ప్రాణాలతో చెలగాటం!