వరంగల్ నగరంలోని శివాలయాలు శివనామస్మరణతో మారుమోగాయి. కార్తిక సోమవారాలు పురస్కరించుకుని నగరంలోని కోటిలింగాల ఆలయంతో పాటు... కాశిబుగ్గలోని కాశీవిశ్వేశ్వర స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు.

స్వామివారికి భక్తులు పంచామృతాలతో ప్రత్యేక అభిషేకం నిర్వహించారు. ఖిలా వరంగల్ కోటలోని స్వయంభు ఆలయంలో స్వామి వారికి రుద్రాభిషేకం నిర్వహించారు. చివరిరోజు భక్తులు ధ్వజస్తంభం ఎదుట ఉసిరిలో నేతిదీపాలు పెట్టి మొక్కులు చెల్లించుకున్నారు.
