Devil Fish: వరంగల్ నగరంలోని అగర్త చెరువులో చేపల వేటకు వెళ్లిన వ్యక్తికి ఓ అరుదైన చేప చిక్కింది. బంగ్లాదేశ్‌లో ఎక్కువగా ఉండే క్యాట్ ఫిష్ సంతతికి చెందిన చేప.. స్థానికంగా నివసించే కిషోర్‌కు దొరికింది. ఈ వింత చేపను చూడటానికి స్థానికులు ఆసక్తి చూపారు.
దీనిని డెవిల్ పిఫ్ లేక విమానం చేప అని పిలుస్తారని స్థానికులు తెలిపారు. ఈ రకం చేపలు తినడానికి ఉపయోగపడవని చెప్పారు. మత్స్యకారుని వలలో చిక్కిన ఈ రెండు విమానం చేపలను వీడియోలో బంధించారు. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది.
ఇదీ చదవండి: Telangana Rains Today : వరణుడి బీభత్సానికి వణుకుతున్న తెలంగాణ