వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలోని వేయి స్థంభాల గుడిలో శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాలను ఛైర్మన్ మర్రి యాదవ్ రెడ్డి, ఆలయ ప్రధాన అర్చకులు గంగు ఉపేంద్ర శర్మ ప్రారంభించారు.
మొదటి రోజు అమ్మవారిని బాలా త్రిపుర సుందరి దేవిగా అలంకరించారు. 9 రోజుల పాటు ఆలయంలో ప్రత్యేక పూజలు జరుగుతాయని అర్చకులు తెలిపారు.
పద్మాక్షి దేవాలయంలో ఉత్సవాలను వరంగల్ నగర పాలక కమిషనర్ పమేలా సత్పతి ప్రారంభించారు.
ఇదీ చదవండి: మల్టీప్లెక్స్‌ల నిర్వహణకు 25 శాతం అదనపు భారం!