Mirchi Record Rate: వరంగల్ ఎనుమాముల మార్కెట్‌లో మిర్చికి రికార్డు ధర పలుకుతోంది. దేశీయ రకం మిర్చి క్వింటాల్‌కు 52వేలు పలికింది. దేశీ రకం మిర్చి ఎక్కువగా పండించే ఉమ్మడి వరంగల్ జిల్లాలో అకాల వర్షాలతో పంట తీవ్రంగా దెబ్బతింది. వేలాది ఎకరాల్లో పంట నేలపాలైంది. కొన్ని ప్రాంతాల్లో వడగండ్ల వానకు మిర్చి తోటలు ధ్వంసం అయ్యాయి. దిగుబడులు సైతం గణనీయంగా తగ్గిపోయాయి. ఈ నేపథ్యంలో వచ్చిన మిర్చికి మంచి ధర లభిస్తోంది.
దేశ చరిత్రలోనే సరికొత్త రికార్డు ధరలు నమోదు అవుతున్నాయి. అకాల వర్షాల వల్ల చాలావరకు పంటకోల్పోయి వచ్చిన కొంత పంటకు మంచి ధర లభించడం రైతులకు కొంత ఉపశమనం కలిగిస్తోంది. రికార్డు ధర లభిస్తుండడం వల్ల అన్నదాతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మిర్చికి ఇంత ధర పలకడం ఇదే తొలిసారని చెబుతున్నారు.
ఇదీ చదవండి: