వరంగల్ పట్టణ జిల్లా ఎల్కతుర్తి మండలం కోతుల నడుమ గ్రామం ఎస్ఆర్ఆర్ కళాశాల వద్ద ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. వేగంగా వస్తున్న కారు ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న ఘటనలో ద్విచక్ర వాహనాన్ని నడుపుతున్న అల్లి భిక్షపతి అక్కడికక్కడే మృతి చెందాడు. భిక్షపతి కుమారునికి తీవ్ర గాయాలవడం వల్ల చికిత్స నిమిత్తం వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు.
హుజూరాబాద్ మండలం కాట్రపల్లి గ్రామానికి చెందిన అల్లి భిక్షపతి ఆర్ఎంపి వైద్యుడుగా పనిచేస్తున్నాడు. తన కుమారుడిని హన్మకొండలోని ఓ కళాశాలలో చేర్పించడానికి కుమారునితో కలిసి బైక్పై వెళ్తున్నాడు. హన్మకొండ నుంచి కరీంనగర్ వైపు వస్తున్న ఇండికా కారు వేగంగా వచ్చి ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టడం వల్ల ఈ ఘటన జరిగింది. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కారు నడిపిన డ్రైవర్ను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
ఇదీ చూడండి : ఓరుగల్లులో రూ. 900 కోట్ల పెట్టుబడితో భారీ పరిశ్రమ