ఈనెల 15న తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం పడవ ప్రమాదంలో వరంగల్ అర్బన్ జిల్లా కాజీపేట్ మండలం కడిపికొండకు బస్కే అవినాశ్, బస్కె రాజేందర్లు మృతి చెందారు. వారి మృతదేహాలను రాజమండ్రి ప్రభుత్వాసుపత్రి నుంచి స్వగ్రామానికి తరలించారు. విహార యాత్రకు వెళ్లి విగత జీవులుగా వచ్చి తమ వారిని చూసి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. ఇదే గ్రామం నుంచి విహార యాత్రకు వెళ్లిన... 14 మంది ప్రమాదానికి గురయ్యారు. వారిలో ఐదుగురు సురక్షితంగా బయటపడ్డారు. గల్లంతైన తొమ్మిది మందిలో ఇద్దరి మృతదేహాలు లభ్యమయ్యాయి. మరో ఏడుగురి ఆచూకీ ఇప్పటివరకు లభించలేదు.
- ఇదీ చూడండి : బోటు ప్రమాదం... ఇంకా దొరకని 35 మంది ఆచూకీ