వరంగల్ రూరల్ జిల్లాలోని గ్రామాలు, పట్టణాల్లో దసరా ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ముందుగా నర్సంపేట పట్టణంలోని శ్రీవెంకటేశ్వరస్వామి ఆలయంలో గ్రామ పెద్దల సమక్షంలో శమీ పూజను నిర్వహించారు. అనంతరం గ్రామదేవతైన బొడ్రాయికి పూజలు చేసి సోరకాయను నరకిన అనంతరం దేవతల పూజా కార్యక్రమం పూర్తయింది. అంగడి మైదానంలో ఏర్పాటు చేసిన జమ్మిచెట్టుకు ఆయుధ పూజ చేశారు. అక్కడకు వచ్చిన ప్రజలు జమ్మి ఆకును తీసుకుని పెద్దలకు అందించి వారి ఆశీర్వాదాలను తీసుకున్నారు. ఈ కార్యక్రమానికి శానసభ్యుడు పెద్ది సుదర్శన్ రెడ్డి హాజరయ్యారు. సద్దుల బతుకమ్మ రోజు భారీ బతుకమ్మలను పేర్చిన మహిళలకు బహుమతులు అందచేశారు. నగర పాలక సంస్థలో పనిచేసే కార్మికులను సన్మానించారు. అనంతరం రావణాసురుని దహన కార్యక్రమంలో పాల్గొన్నారు. రావణ వధను చూసేందుకు చుట్టు ప్రక్కల మండలాల నుంచి కూడా ప్రజలు వచ్చారు. ఎలాంటి అవాంచనీయ ఘటనలు జరుగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
ఇవీ చూడండి: రెండ్రోజుల కస్టడీకి ఈఎస్ఐ నిందితులు