వరంగల్ అర్బన్ జిల్లా ధర్మసాగర్ మండలంలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయి. ఓటర్లకు తాగునీరు, వృద్ధుల కోసం చక్రాల కుర్చీలు, అత్యవసర ప్రాథమిక వైద్య సదుపాయాలు వంటి సౌకర్యాలను అధికారులు పోలింగ్ కేంద్రాల వద్ద కల్పించారు. ధర్మసాగర్ మండలంలోని పోలింగ్ కేంద్రాలను వరంగల్ నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ విశ్వనాథ్ రవీందర్ సందర్శించారు. పోలింగ్ ప్రశాంతంగా సాగుతోందని.. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేయడం జరిగిందని సీపీ తెలిపారు.
పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన వరంగల్ నగర సీపీ
ఎన్నికల సరళీని పరిశీలించేందుకు పోలింగ్ కేంద్రాలను వరంగల్ నగర పోలీసు కమిషనర్ పరిశీలించారు. అవాంఛనీయ ఘటనలు జరుగకుండా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశామని విశ్వానాథ్ రవీందర్ తెలిపారు.