కొవిడ్ టీకా పేరడి పాట మీరు వినండి..! - Raghupati parody on Sarangadharia song
కరోనా టీకాపై అవగాహన కల్పించేందుకు వరంగల్ పట్టణ జిల్లాకు చెందిన ఓ ఉపాధ్యాయుడు వినూత్న ప్రయోగం చేశాడు. జానపద పాటను పేరడిగా మలిచి కొవిడ్ టీకా వేసుకోవాలని సూచిస్తున్నాడు. ఈ మధ్య కాలంలో ప్రేక్షకుల నుంచి విశేష ఆదరణ పొందిన "సారంగ దరియా" పాటను పేరడిగా మలిచాడు. కమలాపూర్ మండలం గూనిపర్తికి చెందిన రఘుపతి. సామాజిక బాధ్యతగా కొవిడ్ టీకాపై రాసిన పేరడి పాట... సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా చక్కర్లు కొడుతోంది. ప్రతీ ఒక్కరు కొవిడ్ నిబంధనలు పాటించాలని రఘుపతి సూచిస్తున్నాడు.