వరంగల్ పట్టణ జిల్లా ఐనవోలు మల్లన్న ఆలయంలో హుండీల లెక్కింపు ప్రారంభించినట్లు ఆలయ అధికారులు తెలిపారు. సంక్రాంతిని పురస్కరించుకుని 5 రోజులపాటు స్వామివారి జాతర అంగరంగ వైభవంగా జరిగింది.
జాతరకు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని బంగారం, వెండి, డబ్బుల రూపంలో కానుకలు సమర్పించుకున్నారు. మెత్తం 18హుండీలను లెక్కించనున్నట్లు ఆలయ అధికారులు వెల్లడించారు. సాయంత్రం వరకు హుండీల లెక్కింపు పూర్తవనున్నట్లు తెలిపారు.
ఇదీ చదవండి: అపోహలు వీడండి.. టీకా వేయించుకోండి: ఉప సభాపతి