ETV Bharat / state

కరోనాతో పోరాడలేక.. ఆత్మహత్య చేసుకున్న మహిళ - వరంగల్​ పట్టణ జిల్లా వార్తలు

కరోనా వస్తే.. తన దగ్గరికి ఎవరూ రారని భయపడింది. అదృష్టం బాగలేక ప్రాణాలు కోల్పోతే.. తన మృతదేహాన్ని కూడా ఎవరూ తాకరనుకుంది. కరోనాతో పోరాడే ధైర్యం లేక.. పురుగుల మందు తాగి ఓ మహిళ ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన వరంగల్​ అర్బన్​ జిల్లాలో చోటు చేసుకుంది.

corona victim suicide in Warangal Urban District
కరోనాతో పోరాడలేక.. ఆత్మహత్య చేసుకున్న మహిళ
author img

By

Published : Jul 25, 2020, 8:59 PM IST

వరంగల్ అర్బన్ జిల్లా హసన్​పర్తి మండల కేంద్రంలో కరోన బాధితురాలు ఆత్మహత్య చేసుకుంది. రెండు రోజుల పాటు జ్వరంతో బాధపడిన హసన్​పర్తి మండలానికి చెందిన ఓ మహిళ వరంగల్​ ఎంజీఎం ఆస్పత్రిలో కరోనా పరీక్షలు చేయించుకుంది. ఫలితాల్లో పాజిటివ్​ అని తేలింది. కరోనా వస్తే.. తన దగ్గరిని ఎవరూ రారనుకుంది. తనను ఎవరూ ముట్టుకోరని మనస్తాపానికి గురైంది. తిరిగి ఇంటికి వచ్చే దారిలో పురుగుల మందు తాగి.. ఆత్మహత్య చేసుకున్నది. చికిత్స కోసం ఆస్పత్రికి తరలించే లోపే ప్రాణాలు కోల్పోయింది.

అంతకు రెండు రోజుల ముందే ఆమె కూతురు జ్వరంతో బాధపడింది. ఆమెను వరంగల్​ ఎంజీఎం ఆస్పత్రికి తీసుకెళ్లి వైద్యం చేయించింది. మృతురాలికి భర్త, ఇద్దరు కూతుళ్లు, ఇద్దరు కుమారులు ఉన్నారు.

ఇవీ చూడండి: రాష్ట్రంలో అంతకంతకూ విజృంభిస్తున్న కరోనా..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.