ETV Bharat / state

కాజీపేట కెనరా బ్యాంక్​లో కరోనా కలకలం - Kazipet Canara Bank closed with corona effect

వరంగల్ అర్బన్ జిల్లా మడికొండలోని కెనరా బ్యాంక్​లో ఉద్యోగికి కరోనా పాజిటివ్​గా తేలింది. బ్యాంకు పరిసరాలను శానిటైజర్​తో శుభ్రపరిచారు. కరోనా కారణంగా బ్యాంకుకు సెలవు ప్రకటించినట్లు తెలిపారు.

Corona Positive to an employee of Kazipet Canara Bank
కాజీపేట కెనరా బ్యాంక్​లో కరోనా కలకలం
author img

By

Published : Jul 15, 2020, 7:07 PM IST

వరంగల్ అర్బన్ జిల్లా కాజీపేట మండలం మడికొండలోని కెనరా బ్యాంక్​లో కరోనా కారణంగా కార్యకలాపాలు నిలిచిపోయాయి. బ్యాంకులో పనిచేస్తున్న ఒక ఉద్యోగికి కరోనా పాజిటివ్​గా నిర్ధరణ అయింది. ఈ కారణంగా ముందు జాగ్రత్త చర్యలో భాగంగా బ్యాంకుకు సెలవు ప్రకటించి.. శానిటైజర్​తో బ్యాంకు పరిసరాలను శుభ్రం చేశారు.

ఆ వ్యక్తి హైదరాబాద్​కు చెందిన వాడని.. విధి నిర్వహణలో భాగంగా అక్కడి నుండి ప్రతిరోజు వచ్చి వెళ్తుండేవాడని తెలిపారు. బ్యాంక్‌కు తాళం వేసిన అధికారులు.. కరోనా కారణంగా బ్యాంకులో కార్యకలాపాలు నిలిపివేసినట్లు గేటుకు నోటీసు అంటించారు.

ఇదీ చూడండీ: 'కరోనాను జయించి విధుల్లో చేరడం సమాజానికే ఆదర్శం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.