ETV Bharat / state

వరంగల్​ను వణికిస్తున్న కరోనా... అందుబాటులోకి మరో యంత్రం

ఉమ్మడి వరంగలో జిల్లాల్లో కరోనా వైరస్‌ కమ్మేస్తోంది. ప్రధానంగా అర్బన్​ జిల్లాలో వైరస్ విజృంభిస్తోంది. ఎంజీఎం ఆస్పత్రిలో ఇప్పటికే కొవిడ్​ బాధితులతో పడకలు నిండిపోయాయి. కాకతీయ వైద్య కళాశాలలో నమూనాల పరీక్షలకు గాను... అదనంగా మరో యంత్రం అందుబాటులోకి రానుంది. ఈ నేపథ్యంలో కేసుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.

corona-positive-cases-raised-in-warangal-district
వరంగల్​ను వణికిస్తున్న కరోనా... అందుబాటులోకి మరో యంత్రం
author img

By

Published : Jul 21, 2020, 7:39 AM IST

వరంగల్ అర్బన్ జిల్లాలో కరోనా విజృంభిస్తూనే ఉంది. ప్రారంభంలో 40 లేదా 50 కేసులు మాత్రమే రాగా... ఇప్పుడు బాధితుల సంఖ్య పెరిగిపోతుంది. ఆదివారం ఒక్కరోజే 117 కేసులు రావడం సర్వత్రా ఆందోళన కలిగిస్తోంది. సోమవారం సైతం 73 పాజిటివ్ కేసులు నమోదు కావడంతో జిల్లా వాసులు భయాందోళనలకు గురవుతున్నారు.

అదనంగా పడకలు

ఎంజీఎంలో కొవిడ్ వార్డులో ఉన్న 200 పడకలు... బాధితులతో నిండిపోయాయి. మరో 200 పడకలను అందుబాటులోకి తెచ్చేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. స్థానికులే కాకుండా పోలీసులు, వైద్యులు, నర్సులు, పలువురు ప్రజాప్రతినిధులు కొవిడ్ బారిన పడుతున్నారు. వీరితో సన్నిహితంగా ఉన్నవారు హోం క్వారంటైన్​లో ఉంటున్నారు.

స్వచ్ఛందంగా..

ర్యాపిడ్ యాంటిజెన్ పరీక్షలు జరుగుతుండటంతో... కేసుల సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. కేసులు ఎక్కువ అవుతుండడంతో... జనం బయటకు రావడానికే జంకుతున్నారు. రహదారులపైనా దుకాణాల వద్ద రద్దీ బాగా తగ్గింది. తదితర ప్రాంతాల్లో స్వర్ణకారులు, బట్టలు, వర్తక వాణిజ్య వ్యాపారులు స్వచ్ఛందంగా లాక్​డౌన్ పాటిస్తున్నారు. కొందరు దుకాణాల సమయాలను తగ్గించారు.

హైదరాబాద్‌ తర్వాత రాష్ట్రంలోనే తొలిసారిగా వరంగల్‌ కేఎంసీలోనే కొవిడ్​ను నిర్ధరించేందుకు ప్రయోగశాలను ఏర్పాటు చేశారు. 12 జిల్లాలకు సంబంధించిన నమూనాలతోపాటు... ఎంజీఎం ఆసుపత్రిలోనూ కరోనా సోకిన వారి సంఖ్య పెరుగుతుండటంతో... పెద్ద సంఖ్యలో నమూనాలను పంపిస్తున్నారు.

అధికంగా పాజిటివ్‌ కేసులు వస్తుండటంతో ప్రయోగశాలల్లో పరీక్షలు నిలుపుదల చేసి... వారం రోజులకు ఒకసారి ఫ్యూమిగేషన్‌ చేయాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో ఫలితాల వెల్లడి ఆలస్యమవుతోంది. మూడో యంత్రం కూడా అందుబాటులోకి రానున్న నేపథ్యంలో ఫలితాలు ఇంకా తొందరగా, ఎక్కువగా రానున్నాయి.

ఇదీ చూడండి: కరోనా విలయం: కోటి 47 లక్షలు దాటిన కేసులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.