కరోనా మానవ సంబంధాలను చిన్నాభిన్నం చేస్తోంది. వరంగల్ జిల్లా బయ్యారం మండల కేంద్రంలో వైరస్ సోకిన కుటుంబం తమకు కావాల్సిన సరకులను దగ్గరి బంధువు ద్వారా తెప్పించుకునేందుకు ప్రయత్నించారు.
ఇతడికి ఏం లేకపోయినా కిరాణ సామగ్రి, పాలు, కూరగాయలు ఇచ్చేందుకు వ్యాపారులు నిరాకరిస్తుండటం స్థానికంగా కలకలం సృష్టించింది. నిన్న మొన్నటి వరకు పలకరించినా ఇరుగుపొరుగు వారు ఇప్పుడు కనీసం కన్నెత్తి చూసేందుకు ఇష్టపడటం లేదు.
చివరికి పాలు పోసే వ్యక్తి తమ ఇంటికి రావడం మానేశాడని చరవాణిలో గోడు వెల్లబోసుకున్నారు. కరోనా ప్రభావం లేని సమయంలో సాయం అందించిన దాతలు.. పాజిటివ్ వచ్చినప్పుడు పట్టించుకుంటే బాగుండేదని వారు వాపోతున్నారు.
ఇదీ చూడండి: వీధిలో విడిచిపెట్టిన కొడుకు... దీనంగా ఎదురుచూస్తున్న తల్లి