వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కరోనా కేసులు రోజు రోజుకీ పెరుగుతున్నాయి. గత 24 గంటల్లో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 694 కేసులు నమోదయ్యాయి. వరంగల్ అర్బన్ జిల్లాలో 203, వరంగల్ రూరల్ జిల్లాలో 191, మహబూబాబాద్ జిల్లాలో 97, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 68, జనగామ జిల్లాలో 88, ములుగు జిల్లాలో 47 కొవిడ్ కేసులు నమోదయ్యాయి.
కిట్ల కొరత ఉండడంతో... పరీక్షలు పలు చోట్ల తక్కువుగా జరుగుతున్నాయి. ఇటు ఎంజీఎం కొవిడ్ వార్డులోనూ.. రోజు రోజుకీ చేరే కరోనా బాధితుల సంఖ్య ఎక్కువవుతోంది. బుధవారం నుంచి మరో 200 పడకలు కరోనా బాధితులకు అందుబాటులో తేనున్నట్లు ఆసుపత్రి సూపరింటెండెంట్ తెలిపారు.
ఇటు జిల్లాల్లో ఆలయాలు ఒక్కొక్కటిగా మూతపడుతున్నాయి. మేడారం సమ్మక్క సారలమ్మ గద్దెల చెంతకు దర్శనాలను మే1 నుంచి 15 రోజులు నిలిపివేయగా... రామప్ప ఆలయాన్ని మే 16వరకూ మూసివేశారు. బుధవారం నుంచి కాళేశ్వరంలోనూ భక్తులకు వారం రోజుల పాటు దర్శనాలను నిలిపివేస్తున్నట్లు ఆలయ అధికారులు చెప్పారు. స్వామి అమ్మవార్లకి ఉదయం సాయంత్రం వేళల్లో అర్చకులు... పూజలు మాత్రమే నిర్వహిస్తారని తెలిపారు.
ఇదీ చూడండి : రాష్ట్రంలో కొత్తగా 8,061 కరోనా కేసులు, 56 మంది మృతి