కాజీపేట కోచ్ ఫ్యాక్టరీపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నాటకం ఆడుతున్నాయని కాంగ్రెస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మల్కాజిగిరి ఎంపీ రేవంత్‌రెడ్డి ఆరోపించారు. అన్ని అవకాశాలున్న వరంగల్‌ను ఎందుకు అభివృద్ధి చేయడం లేదని ప్రశ్నించారు. తెరాస ప్రభుత్వాన్ని.. భాజపా నేతలు వత్తాసు పలుకుతున్నారని విమర్శించారు.
రాష్ట్ర ప్రభుత్వంపై అవినీతి ఆరోపణలు చేస్తున్న భాజపా నేతలు.. కేంద్రానికి ఎందుకు ఫిర్యాదులు చేసి.. చర్యలు తీసుకొనేలా చొరవ తీసుకోవడం లేదో చెప్పాలని రేవంత్‌రెడ్డి డిమాండ్ చేశారు. కాంగ్రెస్‌ను అణగదొక్కడానికి... తెరాస, భాజపాలు కలిసి నాటకాలు ఆడుతున్నాయని ఆరోపించారు.
వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్.. సమీక్షలు చేయడం లేదంటే అక్కడి పరిస్థితులు ఎంతో దారుణంగా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చని రేవంత్ అన్నారు. ఎనిమిదేళ్లుగా వరంగల్‌ను అభివృద్ధి చేయని.. తెరాస ప్రభుత్వం ఇప్పుడేం చేస్తుందని రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు.
ఇవీచూడండి: వరంగల్‌ను ఫ్లడ్ ఫ్రీ సిటీగా మారుస్తాం: కిషన్‌రెడ్డి