పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరలను పెంచుతూ.. కేంద్రం సామాన్యులపై పెనుభారం మోపుతోందని వరంగల్లోని కాంగ్రెస్ నాయకులు మండిపడ్డారు. కాశిబుగ్గలోని మహాత్మా గాంధీ విగ్రహం ఎదుట ఆందోళన నిర్వహించారు. తక్షణమే ధరలు తగ్గించాలని డిమాండ్ చేశారు.
దిగువ, మధ్య తరగతి ప్రజలను.. కేంద్రం నిత్యావసరాలను సైతం కొనుగోలు చేయలేని స్థితికి దిగజార్చిందని నేతలు విమర్శించారు. ధరలను తగ్గించని పక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు.
ఇదీ చదవండి: 'ఉద్యోగ నియామకాలపై శ్వేతపత్రం విడుదల చేయాలి'