రంజాన్ ఉపవాస దీక్షలు ఉంటున్న ముస్లింలకు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పండ్లను పంపిణీ చేశారు. వరంగల్ తూర్పు నియోజకవర్గంలోని యాకూబ్పురా, నిజంపురాలోని ముస్లింల ఇంటింటికీ తిరుగుతూ పండ్లను అందజేశారు. లాక్డౌన్ కారణంగా ప్రజలు బయటకు వెళ్లే అవకాశం లేనందున.. ముస్లింల ఇబ్బందులను గుర్తించి పండ్లు పంపిణీ చేసినట్లు తెలిపారు.
ఇదీ చూడండి: ఆపరేషన్ కరోనా: వారికి ఆదాయ పన్ను భారీగా పెంపు!