ETV Bharat / state

కొత్త నంబర్​ నుంచి మీ వాట్సప్​కు వెడ్డింగ్‌ ఇన్విటేషన్‌ వచ్చిందా? - అది చెక్​ చేయకుండా ఓపెన్ చేశారో? - FRAUD BY WEDDING INVITATION LINKS

పెళ్లి ఆహ్వాన పత్రిక పేరుతో వాట్సప్‌కు మోసపూరిత ఫైళ్లు - లింకులు, ఫైళ్లు డౌన్​లోడ్​ చేస్తే సైబర్‌ నేరస్థుల అధీనంలోకి ఫోన్‌

cyber crime through whatsapp
Cyber Fraud by Fake Whatsapp Wedding Invitation (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Nov 16, 2024, 9:45 AM IST

Updated : Nov 16, 2024, 9:52 AM IST

Cyber Fraud by Fake Whatsapp Wedding Invitation : ఒకప్పుడు ఇంట్లో పెళ్లి వేడుక ఉంటే ఎంత దూరమైనా బంధువుల ఇంటికెళ్లి ఆహ్వాన పత్రిక ఇచ్చేవాళ్లు. కానీ ఇప్పుడు ట్రెండ్​ మారింది. డిజిటల్‌ పత్రికలు, వీడియోలు, వేడుక జరిగే లొకేషన్​ మ్యాప్స్​ లింక్​ ఇలా వాట్సప్​లో పంపించి ఆహ్వానిస్తున్నారు. ఈ టెక్నాలజీనే సైబర్​ నేరస్థులు సైతం తమ అస్త్రంగా మలుచుకుంటున్నారు. వివాహ ఆహ్వాన పత్రిక పేరుతో ఫోన్​కు సందేశాలు, ​ఆండ్రాయిడ్‌ అప్లికేషన్‌ ప్యాకేజీ (ఏపీకే) ఫైళ్లు పంపిస్తూ మోసానికి పాల్పడుతున్నారు. వీటితో బాధితుల నుంచి డబ్బు కొల్లగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇప్పుడిప్పుడే డిజిటల్‌ వెడ్డింగ్‌ ఇన్విటేషన్‌ పేరుతో మోసానికి పాల్పడుతున్నారని సైబర్‌ క్రైమ్‌ పోలీసులు తెలిపారు. కొత్త ఫోన్​ నంబర్ల నుంచి వచ్చే ఆహ్వాన పత్రికలు, వీడియోలు, లింకులు క్లిక్​ చేయొద్దని, వాటిని డౌన్​లోడ్​ చేసుకోవద్దని హెచ్చరిస్తున్నారు.

ఆసక్తితో తెరిస్తే ఇక అంతే : గుర్తుతెలియని నంబర్లు, ఖాతాల నుంచి ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, వాట్సప్​ తదితరాలకు ఆహ్వాన పత్రికలు, వీడియోలు, లింకులు, డాక్యుమెంట్లు, ఫైళ్లను సైబర్​ నేరస్థులు పంపిస్తారు. దీంతో ఎవరు పంపారనే ఆసక్తితో క్లిక్‌ చేస్తే మన ప్రమేయం లేకుండా ఫోన్​లోకి ఏపీకే ఫైల్‌ రూపంలో ఉండే యాప్‌ డౌన్‌లోడ్‌ అవుతుంది. ఫోన్​ గ్యాలరీ, యాప్​లలోని డేటాతో సహా అన్ని రకాల అనుమతుల్ని ఈ మాల్​వేర్​ సొంతంగా దానంతట అదే తీసుకుంటుంది. ఇలా డిజిటల్‌ వెడ్డింగ్‌ ఇన్విటేషన్‌, వీడియోలు అని భావించి డౌన్‌లోడ్‌ చేస్తే ప్రమాదకర సాఫ్ట్‌వేర్‌ యాప్‌లు ఇన్‌స్టాల్‌ అయి ఫోన్‌ హ్యాక్‌ అవుతుంది.

దీంతో సైబర్​ నేరగాళ్లు పూర్తిగా మొబైల్​ ఫోన్​ను తమ అధీనంలోకి తీసుకుని బ్యాంకు ఖాతాల నుంచి డబ్బును కాజేస్తారు. ఫోన్​, కంప్యూటర్‌లోని వ్యక్తిగత ఫొటోలు, వీడియోలు, ఇతర సమాచారాన్ని సేకరించి బెదిరింపులకు పాల్పడే ప్రమాదముంటుంది. ఇప్పటివరకు అయితే రాష్ట్రంలో ఇలాంటి తరహా ఫిర్యాదులు అందకున్నా సైబర్​ నేరగాళ్లు వెడ్డింగ్‌ ఇన్విటేషన్‌, వీడియోలు, లింకులు, ఫైళ్లు పంపుతూ మోసం చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.

'సైబర్​ నేరస్థులు లింకులు​ పంపించి వాటితో డబ్బులు కాజేయాలని ప్రయత్నిస్తున్నారు. కొత్త నంబర్ల నుంచి వచ్చే ఫైళ్లు, లింక్​లు క్లిక్​ చేయవద్దు. వాటిని క్లిక్​ చేస్తే ఏపీకే ఫైల్​ డౌన్​లోడ్​ అవుతుంది. దీంతో యాప్​లు డేటా మొత్తం నేరగాళ్ల సర్వర్​కు చేరవేస్తాయి. ఆ లింక్​ను క్లిక్​ చేయగానే ఫోన్​ డేటా నేరగాళ్ల చేతుల్లోకి వెళుతుంది. కొత్త నంబర్ల నుంచి వచ్చే సందేశం ఏదైనా కచ్చితంగా తనిఖీ చేసుకోవాలి'- నల్లమోతు శ్రీధర్, సైబర్‌ నిపుణుడు

ఈ జాగ్రత్తలు తప్పనిసరి

  • మొబైల్​ ఫోన్​కు ఏదైనా ఫైల్​ వచ్చినప్పుడు అది ఏ రకమైన ఫైల్​ అని చివరి అక్షరాలతో తెలుసుకోవచ్చు. ఉదాహరణకు వెడ్డింగ్​ ఇన్విటేషన్‌ పేరుతో పీడీఎఫ్‌ ఫైల్‌ వస్తే 'ఇన్విటేషన్​.పీడీఎఫ్'​ అని ఆంగ్ల అక్షరాలతో వస్తుంది. అదే ఏపీకే ఫైల్​ అయితే 'వెడ్డింగ్ ఇన్విటేషన్‌.ఏపీకే' అని ఉంటుంది. ఏపీకే అని ఉన్న వాటిని ఎట్టి పరిస్థితిలోనూ డౌన్‌లోడ్‌ చేయవద్దు.
  • తెలిసిన వ్యక్తుల నుంచి వచ్చిన మెసేజ్​ అయినా ఒకసారి పరిశీలించాకే దాన్ని తెరవాలి.
  • ఏపీకే ఫైళ్లను క్లిక్​ చేసిన సమయంలో ప్రమాదకర ఫైల్​ తెరపై కనిపిస్తుంది. వాటిని డౌన్​లోడ్​ చేయవద్దు.

సైబర్​ మోసాల నుంచి కాపాడే 'గోల్డెన్ అవర్' - ఆ ఒక్క గంట పోయిన మీ డబ్బునంతా తిరిగి ఇప్పిస్తుంది

రూ.50 వేలతో స్టార్ట్​ చేశాడు - రూ.కోటి పోగొట్టుకున్నాక కానీ తెలిసిరాలేదు'

Last Updated : Nov 16, 2024, 9:52 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.