కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య హైదరాబాద్ ట్యాంక్ బండ్పై జరిగిన ఘటనపై స్పందించారు. ప్రభుత్వ చర్యలు రజాకార్ల పాలనను తలిపించిందని విమర్శించారు. ఇంతటి దుర్దినం ఏనాడు చూడలేదన్నారు. ఎన్ని అక్రమ అరెస్టులు, గృహనిర్భందాలు చేసినా చలో ట్యాంక్ బండ్ విజయవంతం అయిందని తెలిపారు. కోట్ల విలువ చేసే ఆర్టీసీ ఆస్తులను దక్కించుకోవడానికే కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఆర్టీసీ కార్మికులతో చర్చలు జరుపాలని పొన్నాల లక్ష్మయ్య డిమాండ్ చేశారు.
ఇవీచూడండి: అయోధ్యలో రామమందిరం- ముస్లింలకు ప్రత్యామ్నాయ స్థలం