ఈ నెల 15న జరుగనున్న ప్రాథమిక సహకార సంఘాల ఎన్నికలకు సోమవారం సాయంత్రంతో నామినేషన్ల ఉప సంహరణ ఘట్టం ముగిసింది. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని 97 సహకార సంఘాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. 1260 డైరెక్టర్ పదవులకు గానూ 509 డైరెక్టర్ పదవులు ఏకగ్రీవం కాగా మిగిలిన 751 స్థానాలకు 1868 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు.
ఏకగ్రీవమైన సహకార సంఘాలు:
వరంగల్ అర్బన్ జిల్లా: నందనం, సింగారం
మహబూబాబాద్ జిల్లా: మరిపెడ, గూడూరు, దన్నసరి
వరంగల్ రూరల్ జిల్లా: మొగిలిచర్ల, పెంచికలపేట
జనగామ జిల్లా: పాలకుర్తి, కళ్లెం
ములుగు జిల్లా: పాలంపేట, వాజేడు
జయశంకర్ భూపాలపల్లి జిల్లా: ఘనపురం, చల్పూరు
ఈ నెల 16వ తేదీన గెలుపొందిన డైరెక్టర్‌లలో ఒకరిని ఛైర్మన్‌గా, మరొకరిని వైస్ ఛైర్మన్లుగా ఎన్నుకోనున్నారు.
జిల్లా | సంఘాలు | డైరెక్టర్ పదవులు | ఏకగ్రీవమైన డైరెక్టర్లు | పోటీలో ఉన్న వారు |
---|---|---|---|---|
ములుగు | 12 | 156 | 67 | 203 |
జయశంకర్ | 10 | 130 | 60 | 202 |
వరంగల్ అర్బన్ | 12 | 156 | 74 | 209 |
జనగామ | 14 | 182 | 66 | 329 |
మహబూబాబాద్ | 18 | 234 | 114 | 298 |
వరంగల్ రూరల్ | 31 | 402 | 128 | 627 |