వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్ట్స్ కళాశాల వద్ద ఆగి ఉన్న ట్రాక్టర్ను జయముఖి కళాశాల బస్సు ఢీ కొట్టింది. ఘటనలో ట్రాక్టర్, బస్సు డ్రైవర్లకు గాయాలయ్యాయి. స్థానికులు వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. విద్యార్థులకు ఎలాంటి ప్రమాదం జరగనందున అంతా ఊపిరి పీల్చుకున్నారు. బస్సు డ్రైవర్ వేగంగా నడపడం వల్లే ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు.
ఇవీ చూడండి: యువకుడిపై పెట్రోల్ పోసి నిప్పంటించిన దుండగుడు