ETV Bharat / state

వంగర మంకీ కోర్టులో పండ్ల మొక్కలు నాటే కార్యక్రమం

author img

By

Published : Jul 2, 2020, 7:23 PM IST

వరంగల్‌ అర్బన్‌ జిల్లా వంగర గ్రామంలో కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హన్మంతు పర్యటించారు. ఐదు ఎకరాల స్థలంలో ఏర్పాటు చేస్తున్న మంకీ కోర్టును పరిశీలించి పండ్ల మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించారు. రానున్న రోజుల్లో కోతులకు ఆహారం అందించడానికే మంకీ కోర్టు ఏర్పాటు అని వెల్లడించారు.

వంగర మంకీ కోర్టులో పండ్ల మొక్కలు నాటే కార్యక్రమం
వంగర మంకీ కోర్టులో పండ్ల మొక్కలు నాటే కార్యక్రమం

వరంగల్ అర్బన్ జిల్లా భీమదేవరపల్లి మండలం వంగర గ్రామంలో పలు అభివృద్ధి పనులను జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హన్మంతు పరిశీలించారు. వంగరలో 5 ఎకరాల స్థలంలో ఏర్పాటు చేస్తున్న మంకీ కోర్ట్ పనులను పరిశీలించారు.

హరితహారంలో భాగంగా ఆ 5 ఎకరాల స్థలంలో పండ్ల మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించారు. నాటిన మొక్కలను సంరక్షించి రానున్న రోజుల్లో కోతులకు ఆహారంగా అందించడానికి మంకీ కోర్ట్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు.

అనంతరం గ్రామంలోని శ్మశాన వాటిక, డంపింగ్ యార్డ్‌లను కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ పరిశీలించారు. గ్రామంలోని ప్రభుత్వ పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన స్మృతి వనాన్ని సందర్శించారు. హరితహారంలో నాటిన ప్రతి మొక్కను సంరక్షించాలని అధికారులకు సూచించారు.

ఇద చదవండి: పాఠశాలల ప్రారంభంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు: విద్యాశాఖ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.