ETV Bharat / state

రైతు వేదికల నిర్మాణాలు వారం రోజుల్లో పూర్తి చేయాలి : కలెక్టర్​ - వరంగల్ అర్బన్ జిల్లా సమాచారం

ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన రైతు వేదికల నిర్మాణాలు త్వరతగతిన పూర్తి చేయాలని అధికారులను వరంగల్ అర్బన్ జిల్లా పాలనాధికారి రాజీవ్​గాంధీ హనుమంతు ఆదేశించారు. చివరిదశలో ఉన్న నిర్మాణాలు వారం రోజుల్లోపు పూర్తి కావాలన్నారు.

Collector gives order Complete all pending farmers venues all in warangal urban district
రైతు వేదికల నిర్మాణాలు వారం రోజుల్లో పూర్తి చేయాలి : కలెక్టర్​
author img

By

Published : Nov 16, 2020, 10:56 PM IST

వరంగల్ అర్బన్​ జిల్లాలో నిర్మాణంలో ఉన్న అన్ని రైతు వేదికలను వారం రోజుల్లోగా పూర్తి చేయాలని అధికారులను జిల్లా పాలనాధికారి రాజీవ్​గాంధీ హనుమంతు ఆదేశించారు. హన్మకొండలోని కలెక్టర్ ఛాంబర్​లో పంచాయతీ ఇంజినీరింగ్ అధికారులతో సమావేశం నిర్వహించారు.

ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన రైతు వేదికల నిర్మాణాల పనుల్లో నిర్లక్ష్యం పనికి రాదన్నారు. జిల్లాలో ఇప్పటివరకు 30 వేదికల పనులు పూర్తి కాగా... మరో పది చివరిదశలో ఉన్నాయని తెలిపారు. పెండింగ్​లో ఉన్న బిల్లులను త్వరగా చెల్లించి నిర్మాణాలు వెంటనే పూర్తి కలెక్టర్ సూచించారు.

ఇదీ చూడండి:తెలంగాణకు అన్యాయం జరిగితే కేసీఆర్​ టీం సహించదు: ఎర్రబెల్లి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.