ETV Bharat / state

Heavy Rains in Telangana : ఉత్తర తెలంగాణలో భారీవర్షాలు.. పలు జిల్లాల్లో రెడ్ అలర్ట్ జారీ

Coal Production Affected by Rain Bhupalpally : రాష్ట్రంలో పలుచోట్ల రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం పడుతోంది. భారీ వర్షాలతో భూపాలపల్లి జిల్లా సింగరేణిలో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. మరోవైపు ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగామ జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశముందంటూ రెడ్ అలర్ట్ హెచ్చరికలు జారీచేశారు. భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం పెరుగుతుండగా.. తాలిపేరు రిజర్వాయర్ గేట్లు ఎత్తేశారు.

Rains in Telangana
Rains in Telangana
author img

By

Published : Jul 18, 2023, 1:15 PM IST

Updated : Jul 18, 2023, 2:21 PM IST

Coal Production Stopped Due to Rain Bhupalpally : ఉత్తర తెలంగాణలోని అన్ని జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగామ జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు పడుతున్నాయి. ఇవాళ, రేపు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ రెడ్ అలర్ట్ హెచ్చరికలు జారీచేశారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న వర్షం కారణంగా భూపాలపల్లి సింగరేణి ఉపరితల గని-2, ఉపరితల గని-3లలో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. బొగ్గు తీసేందుకు వాహనాలకు అంతరాయం ఏర్పడింది. వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. సింగరేణి అధికారులు ఎప్పటికప్పుడు మోటర్ల సహాయంతో నీటిని బయటకు పంపిస్తున్నారు. భూపాలపల్లి జిల్లా వ్యాప్తంగా 503.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు అధికారులు వెల్లడించారు.

ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం.. భూపాలపల్లిలో నిలిచిన బొగ్గు ఉత్పత్తి

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని 11 మండలాలలో వర్షపాతం..

1. మహదేవ్‌పూర్ - 18.6 మిమీ.

2. పలిమెల - 21.8

3. ముత్తారం - 50.4

4. కాటారం - 38.8

5. మల్హర్రావు - 35.0

6. చిట్యాల - 64.8

7. టేకుమట్ల - 57.0

8. మొగుళ్లపల్లి - 55.6

9. రేగొండ - 73.0

10. ఘన్‌పూర్ - 41.2

11. భూపాలపల్లి - 47.6

జిల్లా మొత్తం 503.8 మిల్లిమీటర్ల వర్షపాతం నమోదు కాగా.. జిల్లా సగటు 45.8 మిమీ వర్షపాతం నమోదైనట్లు అధికారులు వెల్లడించారు.

Godavari Water Level Bhadrachalam : మరోవైపు ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు వస్తున్న వరద నీటితో భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం పెరుగుతుంది. సోమవారం వరకు 13 అడుగులు ఉన్న గోదావరి నీటిమట్టం ఈరోజు ఉదయానికి 16 అడుగుల వద్దకు చేరి ప్రవహిస్తోంది. గోదావరి ఎగువన ఉన్న చర్ల మండలంలోని తాలిపేరు ప్రాజెక్టుకు వరద నీరు వచ్చి చేరుతోంది. తాలిపేరు ఎగువ ప్రాంతంలో ఉన్న ఛత్తీస్​గఢ్ నుంచి వరదనీరు వచ్చి తాలిపేరు ప్రాజెక్టులో చేరుతున్నాయి. ప్రాజెక్టు 15 గేట్లను ఎత్తి 9,000 క్యూసెక్కుల వరద నీటిని దిగునున్న గోదావరి నదిలోకి వదులుతున్నారు. ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరద నీటి వల్ల భద్రాచలం వద్ద ఇంకా నీటిమట్టం పెరిగే అవకాశం ఉందని కేంద్ర జల వనరులశాఖ అధికారులు తెలుపుతున్నారు. రేపటికి గోదావరి నీటిమట్టం మరో పది అడుగుల వరకు పెరిగే అవకాశం ఉందని సీడబ్ల్యూసీ అధికారుల అంచనా.

భద్రాచలం వద్ద పెరుగుతున్న గోదావరి నీటిమట్టం

Sri Ramsagar Project Water Level Today : మరోవైపు నిజామాబాద్ జిల్లా మెండోరా మండలం శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు స్వల్ప వరద కొనసాగుతోంది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా ప్రాజెక్టులోకి వరద వచ్చి చేరుతోంది. ప్రాజెక్టులోకి 14,761 క్యూసెక్కుల వరద వచ్చి చేరగా.. ప్రస్తుతం ప్రాజెక్టులో 1070.90 అడుగుల నీరు ఉంది. అలాగే ప్రాజెక్టులో 30.780 టీఎంసీల నీటి నిల్వ ఉంది. ఎగువ ప్రాంతం నుంచి వరద వచ్చి చేరుతుండడంతో రివర్స్ పంపింగ్ ద్వారా నీటిని మళ్లించడాన్ని అధికారులు తాత్కాలికంగా నిలుపుదల చేశారు. అయితే జులై 7వ తేదీ నుంచి 17వ తేదీ వరకు ముప్కాల్ పంప్ హౌస్ ద్వారా 2.55 టీఎంసీల కాళేశ్వరం జలాలను ప్రాజెక్టులోకి ఎత్తి పోశారు.

ఇవీ చదవండి:

Last Updated : Jul 18, 2023, 2:21 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.