ETV Bharat / state

రాకేశ్​ మృతిపట్ల సీఎం కేసీఆర్​ దిగ్భ్రాంతి.. 25 లక్షల ఆర్ధికసాయం - cm kcr announced 25 lakhs on rakesh death

సికింద్రాబాద్​ ఘటనలో వరంగల్​ జిల్లాకు చెందిన రాకేశ్​ మృతి పట్ల సీఎం కేసీఆర్​ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రాకేశ్​ కుటుంబానికి రూ. 25 లక్షల ఆర్థికసాయంతో పాటు.. వారి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కూడా ఇస్తానని ప్రకటించారు.

cm kcr reacted on rakesh death and announced 25 lakhs of ex gratia

author img

By

Published : Jun 18, 2022, 3:08 AM IST

సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌ ఘటనపై సీఎం కేసీఆర్‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనలో రైల్వే పోలీసులు జరిపిన కాల్పుల్లో మృతిచెందిన వరంగల్‌ జిల్లాకు చెందిన దామెర రాకేశ్‌ మృతిపట్ల సంతాపం తెలిపారు. రాకేశ్​ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. అతడి కుటుంబానికి రూ.25 లక్షల ఆర్థికసాయం ప్రకటించారు. రాకేశ్‌ కుటుంబంలో అర్హులైన వారికి అర్హతమేరకు ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వనున్నట్లు సీఎం ప్రకటించారు. కేంద్రం అనుసరిస్తోన్న తప్పుడు విధానాల వల్ల రాకేశ్‌ మృతిచెందాడని విచారం వ్యక్తం చేశారు. తెలంగాణ బిడ్డలను ప్రభుత్వం కడుపులో పెట్టుకొని కాపాడుకుంటుందని సీఎం కేసీఆర్‌ తెలిపారు.

అగ్నిపథ్ పథకం దేశవ్యాప్తంగా అగ్గిరాజేస్తోంది. ఈ పథకాన్ని రద్దు చేయాలంటూ సికింద్రాబాద్‌లో యువకులు చేపట్టిన ఆందోళన రణరంగంలా మారింది. ఆందోళనకారులను అదుపు చేసేందుకు పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపారు. ఈ క్రమంలో పోలీసుల కాల్పుల్లో ఒకరు మృతి చెందగా.. 13 మందికి గాయాలయ్యాయి. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఆందోళనలో మృతిచెందిన వ్యక్తి వరంగల్‌ జిల్లావాసి దామెర రాకేశ్‌గా గుర్తించారు. ఆర్మీ రిక్రూట్‌మెంట్ బోర్డ్‌కి వెళ్లి అక్కడి నుంచి రైల్వేస్టేషన్‌కి వచ్చినట్లు పోలీసులు తెలిపారు. గాయపడిన ఆందోళనకారులకు గాంధీ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నట్లు వెల్లడించారు.

ఇవీ చూడండి:

For All Latest Updates

TAGGED:

rakesh death
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.