CM KCR Election Campaign Today : ఎన్నికల ప్రచారంలో భాగంగా నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభ(BRS Praja Ashirvada Sabha)లు పేరిట సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా నేడు పాలకుర్తి నియోజకవర్గపు పరిధిలోని మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో జరిగే సభలో పాల్గొననున్నారు. ఇందుకోసం మహబూబాబాద్ రోడ్‌లోని సభాస్థలిలో బీఆర్ఎస్ శ్రేణులు ఏర్పాట్లు చేశారు. పాలకుర్తి అభ్యర్థి, మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు.. కేసీఆర్ పర్యటన(CM KCR Election Campaign)ను ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.
ఈ సభకు దాదాపు 80 వేల నుంచి లక్ష మంది వరకూ హాజరవుతారని బీఆర్ఎస్(BRS) అంచనా వేస్తుంది. ఇప్పటికే ఉమ్మడి వరంగల్ జిల్లాలో జనగామ, మహబూబాబాద్, వర్ధన్నపేట, నర్శంపేట నియోజకవర్గాల్లో సీఎం ప్రజా ఆశీర్వాద సభలు నిర్వహించారు. ఇప్పుడు జరుగుతున్న సభ ఈ జిల్లాలో ఐదోది. ముఖ్యమంత్రి రాక సందర్భంగా పోలీసులు పటిష్ఠ భద్రతా ఏర్పాట్లను చేస్తున్నారు. పాలకుర్తి సభ అనంతరం.. ముఖ్యమంత్రి హెలికాప్టర్లో నాగార్జున సాగర్ నియోజకవర్గంలోని హాలియా.. తర్వాత ఇబ్రహీంపట్నం సభల్లోనూ పాల్గొననున్నారు. అలాగే దీపావళి తర్వాత సోమవారం భద్రాద్రి కొత్తగూడెం, వరంగల్ జిల్లాల్లోని దమ్మపేట, బూర్గంపాడు, నర్సంపేట్ నియోజకవర్గాల్లో సీఎం కేసీఆర్ పర్యటించారు. కాంగ్రెస్, బీజేపీలపై తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తూ.. తన ఎన్నికల ప్రచారాన్ని కొనసాగించారు.
అధికారమే లక్ష్యంగా బీఆర్ఎస్ వ్యూహాలు, ప్రతిపక్షాలపై విమర్శలు గుప్పిస్తూ ప్రచారాలు
BRS Public Meeting Today : కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల తేదీ ప్రకటించిన దగ్గర నుంచి సీఎం కేసీఆర్ తన ప్రచారంతో బీఆర్ఎస్ శ్రేణుల్లో నూతన ఉత్తేజాన్ని నింపుతున్నారు. బీఆర్ఎస్ ఆశీర్వాద సభలతో రాష్ట్రవ్యాప్తంగా సుడిగాలి పర్యటనలు చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్.. మూడోసారి గెలిచి హ్యాట్రిక్ సీఎం కావాలని ఉవ్వెళ్లూరుతున్నారు. అందులో భాగంగా గత నెల 15న ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిన గులాబీ దళాధిపతి.. బీఆర్ఎస్ మేనిఫెస్టోను విడుదల చేస్తూ మొదటి విడతగా హుస్నాబాద్‌లో సభ మొదటి సభను నిర్వహించారు.
CM KCR BRS Public Meetings Schedule : అదే నెల 18వరకు సభలు నిర్వహించారు. ఆ తర్వాత దసరా పండుగ సందర్భంగా సభలను వాయిదా వేశారు. గత నెల 26 నుంచి ఈనెల మూడో తేదీ వరకు రెండో విడత సభలను నిర్వహించారు. నవంబరు 9న గజ్వేల్, కామారెడ్డిలో నామినేషన్లు వేసి.. కామారెడ్డిలో నిర్వహించిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభతో ముగింపు పలికారు. తర్వాత దీపావళి వరకు విరామం తీసుకుని మూడో విడత ఎన్నికల ప్రచారం ప్రారంభించి 16 రోజుల్లో 54 సభలు నిర్వహించడానికి ప్లాన్ చేసుకున్నారు.
'ప్రజలను పట్టించుకోని ఎమ్మెల్యేలను గెలిపిస్తే ప్రజాస్వామ్యానికి అర్థం లేదు'
విచక్షణతో ఓటు వేస్తేనే ప్రజాస్వామ్యంలో ప్రజలు గెలుస్తారు: కేసీఆర్