ETV Bharat / state

Civils Results 2021: 'సివిల్స్ ర్యాంకర్స్‌ విజయ సూత్రాలివే' - civils rankers sharat nayak and ranjith kumar face to face with etv bharat

Civils Results 2021: సివిల్స్- 2021 ఫలితాలు విడుదలయ్యాయి. ఫలితాల్లో తెలంగాణ అభ్యర్థులు సత్తా చాటారు. రాష్ట్రానికి చెందిన శరత్ కుమార్ 374 వ ర్యాంకు సాధించగా, మూడో ప్రయత్నంలో రంజిత్ కుమార్ 574 వ ర్యాంకు సాధించారు. సివిల్స్ సాధించే క్రమంలో వారు పరీక్షకు ఎలా సన్నద్ధమయ్యారు.. వారి ప్రణాళికలేంటి.. అపజయాల నుంచి ఏం నేర్చుకున్నారు.. తదితర విషయాల గురించి సివిల్స్ ర్యాంకర్స్ శరత్ నాయక్, రంజిత్ కుమార్​తో ఈటీవీ భారత్ ప్రతినిధి నగేశ్ చారి ముఖాముఖి.

civils sharat nayak, ranjith kumar
సివిల్స్​లో తెలంగాణ అభ్యర్థుల హవా
author img

By

Published : May 30, 2022, 9:11 PM IST

శరత్ నాయక్, రంజత్ కుమార్​లతో ముఖాముఖి

"మాది వరంగల్ జిల్లా.. మా నాన్న కృష్ణం రాజు.. స్థానికంగా వ్యాపారం చేస్తున్నారు. అమ్మ గృహిణి. ఎన్​ఐటీ రాయ్​పూర్​లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాను. ఆ తర్వాత రెండేళ్లు ఉద్యోగం చేశాక.. ఇక సివిల్స్​కు ప్రిపరేషన్ మొదలుపెట్టాను. మూడో ప్రయత్నంలో విజయం సాధించాను. మొదటిసారి రాసినప్పుడు ప్రిలిమ్స్ కొట్టలేకపోయాను. రెండో ప్రయత్నంలో ఇంటర్వ్యూ వరకూ వచ్చి ఫెయిలయ్యాను. మూడోసారి గెలుపు సాధించాను. ఈ ప్రయాణంలో తప్పులను సరిదిద్దుకొని పునరావృతం కాకుండా జాగ్రత్తపడ్డాను. ప్రతి దశలోనూ ప్రణాళికాబద్ధంగా కృషి చేస్తూ ముందుకు సాగాలి. ఎంత సేపు చదివాం అనే దాని కంటే.. చదివిన సమయంలో ఎంత బాగా నేర్చుకున్నాం అనేది చాలా ముఖ్యం." -రంజిత్ కుమార్, సివిల్స్ 574 వ ర్యాంకర్

'మా నాన్న రైతు. అమ్మ అంగన్వాడీ టీచర్. నేను వెటర్నరీ డాక్టర్​గా పనిచేస్తున్నా. 2020లో నా గ్రాడ్యుయేషన్ పూర్తైంది. నేను 8 వ తరగతిలో ఉన్నప్పుడే సివిల్స్ లక్ష్యంగా పెట్టుకున్నా. మొదటి ప్రయత్నంలోనే సివిల్స్​లో విజయం సాధించాను. 2017లో ప్రిపరేషన్ మొదలుపెట్టాను. ప్రతి రోజూ వర్తమాన వ్యవహారాలు అనుసరిస్తూ వచ్చాను. రోజూ 5,6 గంటల పాటు చదువుకుంటూ.. కాలేజీకి వెళ్తూ.. రాత్రిళ్లు మళ్లీ చదవడం మొదలుపెట్టాను. ఏడాదిన్నర క్రితం పూర్తిగా సివిల్స్​పైనే ధ్యాస పెట్టాను. అంకిత భావం, నిరంతర కృషి ఈ రెండే నా విజయానికి సూత్రాలు.' -శరత్ నాయక్, సివిల్స్ 374 వ ర్యాంకర్

ఇవీ చదవండి: సివిల్స్ 2021 ఫలితాలు విడుదల.. సత్తా చాటిన తెలుగు తేజాలు

చైనాలో జనాభా సంక్షోభం... పిల్లల్ని కనేందుకు ముందుకు రారే?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.