వరంగల్ జిల్లాలో క్రిస్మస్ పండుగ సంబురాలు అంబరాన్నంటాయి. కాజీపేటలోని ఫాతిమా కాథిడ్రల్ చర్చిలో విద్యుత్ దీపాల వెలుగుల మధ్య క్రిస్మస్ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. క్రైస్తవులు ఏసు ఆగమనాన్ని కీర్తిస్తూ భక్తిశ్రద్ధలతో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ప్రజలంతా కులమత భేదాలు లేకుండా శాంతి సామరస్యాలతో మెలగాలని కోరుకున్నారు. మత పెద్దలు భక్తులకు పండుగ ప్రాశస్త్యాన్ని వివరించారు.
ఇదీ చదవండిః వెలుగు జిలుగుల మధ్య 'క్రిస్మస్' సంబరాలు