వరంగల్ ఏకశిలనగర్‌లో చిరంజీవి ఆక్సిజన్ బ్యాంక్… బ్రాంచ్‌ను ప్రారంభించారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఆక్సిజన్ చాలా విలువైనదని... ప్రాణాన్ని నిలబెట్టే ప్రాణవాయువు అందిస్తున్న మెగాస్టార్ చిరంజీవి నిర్ణయం అభినందనీయమని ఎంజీఎం ఆస్పత్రి సూపరిడెంటెండెంట్ చంద్రశేఖర్ అన్నారు.
ఇరు తెలుగు రాష్ట్రాల్లో ఆక్సిజన్ బ్యాంకులను ఏర్పాటు చేయాలనుకున్న మెగాస్టార్ సంకల్పాన్ని... వద్దిరాజు రవిచంద్ర, కొండా దేవయ్య సహకారంతో చిరంజీవి ఫ్యాన్స్ అసోసియేషన్ స్టేట్ ప్రెసిడెంట్ కరాటే ప్రభాకర్ సంయుక్తంగా నిర్వహిస్తూన్నారు. కార్యక్రమంలో చిరంజీవి అభిమానులు, స్థానికులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి: Palamooru Mango: పాలమూరు మామిడికి మహర్దశ