కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుంది, ప్రజలు ఆందోళన చెందొద్దని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే, ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్ భాస్కర్ అన్నారు. హన్మకొండలో పారిశుద్ధ్య కార్మికులకు నిత్యావసర సరకులు పంపిణీ చేశారు. ప్రతి ఒక్కరూ వ్యక్తిగత పరిశుభ్రత, సామాజిక దూరం పాటించాలని సూచించారు. అందరూ ఇంట్లోనే ఉంటూ లాక్డౌన్కు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
ఇదీ చూడండి: కరోనాపై పోరాటానికి రామోజీ సంస్థల భారీ విరాళం