ETV Bharat / state

కేసులు తగ్గుముఖం.. స్వేచ్ఛగా ప్రయాణం - warangal city latest news today

ఉమ్మడి వరంగల్ జిల్లాలో లాక్​డౌన్ సడలింపుల ఫలితంగా రద్దీ క్రమంగా పెరుగుతోంది. వరంగల్ పట్టణ జిల్లాలో పలు దుకాణాలు ఇప్పటికే తెరుచుకున్నాయ్. మద్యం దుకాణాల వద్ద రద్దీ పూర్తిగా తగ్గింది. క్రమంగా ప్రజలు రోడ్లపైకి వస్తూ ప్రయాణాలు చేస్తున్నారు. జిల్లాలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టడం వల్ల ప్రజలు స్వేచ్ఛగా తిరుగుతున్నారు.

Cases are decreasing travel free journey in warangal city
కేసులు తగ్గుముఖం.. స్వేచ్ఛగా ప్రయాణం
author img

By

Published : May 12, 2020, 5:27 PM IST

వరంగల్ పట్టణ జిల్లాలో ఎలక్ట్రికల్, ఐరన్ హార్డ్​వేర్, స్టీల్, తదితర దుకాణాలు తెరిచారు. ఉమ్మడి వరంగల్​ జిల్లాలో లాక్​డౌన్​ సడలింపుల కారణంగా ప్రజలు స్వేచ్ఛగా వస్తూ ప్రయాణాలు చేస్తున్నారు. కరోనా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటూ నేటి నుంచి జిల్లాలో ఇంటర్మీడియెట్ జవాబుపత్రాల మూల్యాంకనం ప్రారంభమైంది. పేపర్లు దిద్దే అధ్యాపకులు విధిగా మాస్కులు ధరించి మూల్యాంకనంలో పాల్గొన్నారు. భౌతిక దూరం పాటిస్తూ బెంచికి ఒకరే కూర్చుని పేపర్లు దిద్దారు.

ఇటూ ఆసుపత్రులు వద్ద ఓపీల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ప్రైవేటు ఆసుపత్రుల వద్ద రోగుల రద్దీ పెరుగుతోంది. భౌతిక దూరం పాటిస్తూ మాస్కులు ధరించి వైద్యులు రోగులకు చికిత్స చేస్తున్నారు. ఎంజీఎం కొవిడ్ వార్డుల్లో కూడా అనుమానితులు ఎవరూ చేరలేదు. గ్రేటర్‌ వరంగల్‌లోని 18 డివిజన్‌ని పారిశుద్ధ్య కార్మికులకు మేయర్‌ గుండా ప్రకాశ్‌ ఇమ్యూనిటీ పవర్‌ పెరిగేలా హోమియోపతి మందులను పంపిణీ చేశారు.

ఇదీ చూడండి : బతుకమ్మ చీరల ఉత్పత్తి షురూ..మంత్రి కేటీఆర్ హర్షం..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.