సీజనల్ వ్యాధులు రాకుండా జాగ్రత్తలు చేపట్టాలి : పమేలా సత్పతి - వరంగల్ కమిషనర్ అధికారుల సమావేశం
సీజనల్ వ్యాధులు రాకుండా ముందుజాగ్రత్త చర్యలు తీసుకోవాలని వరంగల్ మహానగర పాలక సంస్థ కమిషనర్ పమేలా సత్పతి అధికారులను ఆదేశించారు. కార్పొరేషన్ కౌన్సిల్ హాల్లో ప్రజారోగ్య విభాగం అధికారులతో ఆమె సమావేశం నిర్వహించారు.

పమేలా సత్పతి
వరంగల్ నగరంలోని మురికి కాలువల్లో మురుగు నీరు నిల్వకుండా చర్యలు చేపట్టాలని సానిటరీ ఇన్స్పెక్టర్లకు వరంగల్ కార్పొరేషన్ కమిషనర్ పమేలా సత్పతి సూచించారు. పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ సమీక్ష అనంతరం... కార్పొరేషన్ కౌన్సిల్హాల్లో ప్రజారోగ్య విభాగం అధికారులతో కమిషనర్ సమావేశం నిర్వహించారు.
వర్షాకాలం రాకముందే వరంగల్ మహా నగర పాలక సంస్థ పరిధిలోని నాళాలలో గల చెత్తను యుద్ధ ప్రాతిపదికన తొలగించాలని అధికారులను ఆదేశించారు. గ్రేటర్ వరంగల్ పరిధిలో అంటువ్యాధులు ప్రబలకుండా ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ముమ్మర ప్రచారం చేయాలని చెప్పారు.