కొవిడ్ సమయంలో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారని... ఏ మాత్రం భయపడడం మంచిది కాదని వరంగల్‌లోని ప్రముఖ హృద్రోగ నిపుణులు(Cardiologist) రామక్క శ్రీనివాస్(Ramakka Srinivas) సూచించారు. నీరసం, గుండె దడ సమస్యలతోనే ఎక్కువ మంది తన దగ్గరకు వస్తున్నారని వెల్లడించారు. మధుమేహం, అధిక రక్తపోటు ఉన్నవారూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. వచ్చే మూడు నెలల్లోపు టీకాలిచ్చే కార్యక్రమం పూర్తి చేయగలిగితే.. కరోనాను సమర్ధవంతంగా కట్టడి చేయగలమని తెలిపారు. స్టిరాయిడ్లను ఎక్కువుగా వాడకపోవడమే మంచిదని.. తద్వార బ్లాక్ ఫంగస్‌ను నియంత్రించగలమన్నారు. మంచి ఆహారం, తగిన వ్యాయామం చేయడం ద్వారానే గుండె సంబంధింత సమస్యలు తగ్గించుకోవచ్చంటున్న రామక్క శ్రీనివాస్‌తో ఈటీవీ భారత్ ప్రతినిధి ముఖాముఖి.
ఇదీ చూడండి: మూడో దశలో 25% మంది పిల్లలకు కరోనా వైరస్?