ETV Bharat / state

Bus stop with Plastic Bottles : ప్లాస్టిక్ బాటిళ్లతో బస్టాప్.. ఐడియా అదిరింది గురూ - Bus stop with Plastic Bottles in Uppalapalli

Bus stop with Plastic Bottles in Upparapalli : నిధుల కొరతను అధిగమించి బస్‌షెల్టర్‌ను నిర్మించుకొనేందుకు ఆ గ్రామ పంచాయతీ సరికొత్త పంథా ఎంచుకుంది. తమకు వచ్చిన ఆలోచనను ఆచరించి చూపింది. పంచాయతీ పరిధిలో రోజు రోజుకు పెరిగిపోతున్న ప్లాస్టిక్‌ బాటిళ్లతో బస్‌స్టాప్ నిర్మించాలన్న ఎంపీడీఓ ఆలోచనకు బీజం పడింది. దాదాపు 12 వందల ఖాళీ సీసాలను సేకరించి.. బస్‌షెల్టర్ నిర్మించి ప్రయాణికులకు నీడనిచ్చే విధంగా ఏర్పాటు చేశారు. దీంతో జాతీయ స్థాయిలోనూ ఆ గ్రామపంచాయతీకి ప్రశంసలు వెలువెత్తుతున్నాయి

Uppalapally village
Uppalapally village
author img

By

Published : Jun 8, 2023, 9:41 AM IST

బాటిళ్లతో బస్‌స్టాప్‌ నిర్మాణం

Bus stop constructed with Plastic Bottles in Uppalapalli : ఈ పల్లె గురించి నిన్న మొన్నటి వరకు స్థానికేతరులు అంతగా పట్టించుకోలేదు. కానీ ఇప్పుడా ఆ గ్రామం జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకొంది. ఆ అధికారికి వచ్చిన ఆలోచన ప్రయోగానికి.. ఆ ఊరు వేదికగా మారింది. హుజురాబాద్- పరకాల ప్రధాన రహదారిపై ఉన్న ఉప్పులపల్లి గ్రామపంచాయతీ చేపట్టిన వినూత్న కార్యక్రమం గురించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఆరా తీస్తున్నాయి.

Uppalapalli Bus Stand made up of Plastic Bottles : హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలం ఉప్పులపల్లి గ్రామంలో నిర్మించిన బస్‌షెల్టర్ ఆకర్షణీయంగా నిలుస్తోంది. గ్రామానికి ఖాళీ నీళ్ల సీసాలు ఓ సమస్యగా మారిపోయాయి. నిత్యం పంచాయతీ సిబ్బంది సేకరించిన సీసాలు సెగ్రిగేషన్ షెడ్డుకు వచ్చి చేరుతుండడంతో.. సర్పంచ్ వీటిని తగ్గించడం ఎలా అన్న ఆలోచనలో పడ్డారు. ఇదే అంశాన్ని ఎంపీడీఓ పల్లవితో చర్చించి వెంటనే కార్యరూపంలోకి తీసుకువచ్చారు.

పర్యావరణ పరిరక్షణకు : ఎంపీడీఓ పల్లవికి వచ్చిన ఆలోచన వల్ల ఎన్నో ప్రయోజనాలు కలిగాయని గ్రామస్థులు చెబుతున్నారు. గ్రామంలో బస్‌షెల్టర్ నిర్మాణం ఒక్కటే జరగడం కాకుండా.. పరోక్షంగా పర్యావరణ పరిరక్షణకు కూడా ఈ ఆలోచన ఎంతో దోహదపడిందని అంటున్నారు. ప్రపంచ పర్యావరణ సమతుల్యతకు సవాల్ విసురుతున్న ప్లాస్టిక్ వినియోగం తగ్గించాలని.. అన్ని దేశాలు ప్రత్యేక చర్యలు తీసుకోవాల్సిన ఆవశ్యకత ఏర్పడింది.

"ఉప్పులపల్లి గ్రామపంచాయతీలో ప్లాస్టిక్ బాటిల్స్‌తో బస్‌షెల్టర్ నిర్మించడం జరిగింది. రహదారిపై బస్‌షెల్టర్ లేకపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆ విషయాన్ని మేము గుర్తించాం. ఈ క్రమంలోనే ప్లాస్టిక్ బాటిల్స్‌తో బస్‌స్టాప్ నిర్మించాం. తద్వారా పర్యావరణ పరిరక్షణకు ఉదాహరణగా ఉంటుంది." - పల్లవి, కమలాపూర్‌ ఎంపీడీఓ

"మా గ్రామంలో బస్‌స్టాప్ లేదు. దీంతో మా ఊరి ప్రజలు బస్సుల కోసం ఎండవానల్లో వేచి చూసేవారు. దీనికి పరిష్కారం ఆలోచించాలని అనుకున్నాం. అందుకోసం ఎంపీడీఓ పల్లవి ఇచ్చిన ఆలోచనలకు అనుగుణంగా ప్లాస్టిక్ బాటిల్స్‌తో బస్‌షెల్టర్‌ నిర్మించాం. ఈ బస్‌షెల్టర్ వల్ల ప్రభుత్వానికి ఆర్థిక భారం కూడా గణనీయంగా తగ్గింది." - బొల్లపల్లి ఉమాదేవి, ఉప్పులపల్లి సర్పంచ్

Bus Stand in Plastic Bottles Uppalapalli Village : అయితే ఉప్పులపల్లి గ్రామంలో వినూత్నంగా ఆలోచించి నిర్మించిన బస్‌షెల్టర్ వల్ల.. ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ భూమికి భారం కాకుండా ప్రయాణీకులకు నీడనిచ్చేవిగా తీర్చిదిద్దారు. కేవలం రూ.10,000ల లోపు డబ్బులతో నిర్మించిన ఈ బస్‌స్టాప్‌ వల్ల ప్రభుత్వానికి ఆర్థిక భారం కూడా గణనీయంగా తగ్గిందని గ్రామ సర్పంచ్‌, కార్యదర్శి పేర్కొన్నారు. తక్కువ ఖర్చుతో ఎక్కువ ప్రతిఫలం అందించడంతో పాటు పెరిగిపోతున్న ఖాళీ నీళ్ల సీసాల సమస్యను కూడా అధిగమించానన్న సంతృప్తి కలిగిందని గ్రామస్తులు పేర్కొంటున్నారు. ఇలాంటి మరిన్ని వినూత్న ఆలోచనలతో భవిష్యత్‌లో ముందుకు సాగుతామని వారు వివరించారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.