ETV Bharat / state

ట్రాక్టర్​, ద్విచక్ర వాహనం ఢీ.. బాలుడు మృతి - crime news

రోడ్డు ప్రమాదంలో ఓ బాలుడు మృతి చెందిన ఘటన వరంగల్​ పట్టణ జిల్లా హసన్​పర్తి మండలం నాగారం వద్ద చోటుచేసుకుంది. మరో ఇద్దరికి గాయాలయ్యాయి.

boy died in road accident in warangal urban district
ట్రాక్టర్​, ద్విచక్రవాహనం ఢీ... ఓ బాలుడు మృతి
author img

By

Published : May 26, 2020, 4:25 PM IST

వరంగల్ పట్టణ జిల్లా హసన్​పర్తి మండలం నాగారం వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ట్రాక్టర్, ద్విచక్రవాహనం ఢీకొన్న ఘటనలో విఘ్నేష్​(14) అనే బాలుడు అక్కడికక్కడే మృతి చెందాడు. కాశీబుగ్గకు చెందిన విఘ్నేష్​, మరో ఇద్దరు కలిసి ద్విచక్ర వాహనంపై వెళ్తూ.. నాగారం వద్ద ట్రాక్టర్​ను ఓవర్​టేక్​ చేస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ట్రాక్టర్​ను తప్పించి వెళ్లే క్రమంలో ద్విచక్రవాహనంపై వెనుక కూర్చున్న విఘ్నేష్​కు ట్రాక్టర్ తగిలింది.

దీంతో విఘ్నేష్​ ట్రాక్టర్ టైర్ కింద పడి అక్కడికక్కడే మృతి చెందాడు. మరో ఇద్దరికి గాయాలు కాగా... వారిని స్థానికులు ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. హన్మకొండ నుంచి శనిగరం వెళ్తుండగా... ఈ ఘటన చోటుచేసుకుంది.

ఇవీ చూడండి: జాతీయ రహదారిపై లారీ బోల్తా..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.