ETV Bharat / state

రక్తదాన శిబిరం ఏర్పాటు అభినందనీయం: వినయ్‌భాస్కర్‌

author img

By

Published : Feb 21, 2021, 4:35 PM IST

ఆపదలో ఉన్న వారికి రక్తదానం చేయడం గొప్ప విషయమని ప్రభుత్వ చీఫ్‌ విప్‌ దాస్యం వినయ్‌భాస్కర్‌ అన్నారు. వరంగల్ అర్బన్ జిల్లా కాజీపేటలో జాక్సన్ సోషల్ వెల్ఫేర్ సోసైటీ ఆధ్వర్యంలో 20 వ మెగా రక్తదాన శిబిరానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

blood donation camp in kazipet warangal urban district
రక్తదాతలకు ప్రశంసపత్రాలు అందజేస్తున్న ప్రభుత్వ చీఫ్ విప్‌ వినయ్‌ భాస్కర్‌

రక్తదానం చేయడం వల్ల ఒకరి ప్రాణాలు కాపాడవచ్చని ప్రభుత్వ చీఫ్‌ విప్‌ దాస్యం వినయ్‌భాస్కర్‌ అన్నారు. వరంగల్ అర్బన్ జిల్లా కాజీపేటలో జాక్సన్ సోషల్ వెల్ఫేర్ సోసైటీ ఆధ్వర్యంలో 20వ మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. స్థానిక బాపూజీ నగర్ ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

రక్తదాతలను అభినందించిన చీఫ్ విప్ వారికి ప్రశంస పత్రాలను అందజేశారు. ఆపదలో ఉన్న వారిని కాపాడేందుకు కాజీపేట యువత 20 ఏళ్లుగా రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేయడం అభినందనీయమని దాస్యం వినయ్‌భాస్కర్‌ అన్నారు.

ఇదీ చూడండి : 'సభ్యత్వ నమోదులో నియోజకవర్గాన్ని మొదటిస్థానంలో నిలపాలి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.