ETV Bharat / state

'నియామకాలు లేకనే నిరుద్యోగుల ఆత్మహత్యలు' - bjym protest the death of KU student Boda Sunil Nayak

లక్ష ఉద్యోగాలను భర్తీ చేస్తామని హామీ ఇచ్చిన సీఎం కేసీఆర్‌ దాన్ని నెరవేర్చలేదని, అందుకే నిరుద్యోగులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని.. భాజపా రాష్ట్ర అధికార ప్రతినిధి ఏనుగు రాకేశ్‌ రెడ్డి విమర్శించారు. కేయూ విద్యార్థి బోడ సునీల్ నాయక్ మృతికి నిరసనగా బీజేవైఎం ఆధ్వర్యంలో.. వరంగల్‌ అర్బన్‌ జిల్లా కలెక్టరేట్‌ ముట్టడికి యత్నించారు.

BJYM led agitation in Warangal Urban District to protest the death of KU student Boda Sunil Nayak, Warangal Urban District latest news
కేయూ విద్యార్థి బోడ సునీల్ నాయక్ మృతికి నిరసనగా బీజేవైఎం ఆధ్వర్యంలో ఆందోళన, వరంగల్‌ అర్బన్‌ జిల్లాలో భాజపా యువ మోర్చా ఆధ్వర్యంలో ధర్నా
author img

By

Published : Apr 3, 2021, 4:40 PM IST

మహబూబాబాద్‌ జిల్లాలో బలవన్మరణానికి పాల్పడిన కేయూ విద్యార్థి సునీల్ నాయక్ కుటుంబానికి పరిహారంతో పాటు.. కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని.. భాజపా రాష్ట్ర అధికార ప్రతినిధి ఏనుగు రాకేశ్‌ రెడ్డి డిమాండ్ చేశారు. లక్ష ఉద్యోగాలను భర్తీ చేస్తామని చెప్పిన సీఎం కేసీఆర్‌.. దానిని నెరవేర్చలేదని, అందుకే నిరుద్యోగులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని విమర్శించారు. సునీల్ నాయక్ మృతికి నిరసనగా బీజేవైఎం ఆధ్వర్యంలో.. వరంగల్‌ అర్బన్‌ జిల్లా కలెక్టరేట్‌ ముట్టడికి యత్నించారు.

కేసీఆర్ మొండి వైఖరిని ఎండగడుతూ నిరుద్యోగులకు మద్దతుగా తమ పోరాటం కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు. నాగార్జున సాగర్ ఉప ఎన్నికలో ఓట్లు అడిగే హక్కు తెరాసకు లేదని విమర్శించారు. ఒక గిరిజన బిడ్డకు జరిగిన అన్యాయాన్ని అక్కడి ప్రజలు గుర్తు పెట్టుకోవాలన్నారు. కలెక్టరేట్ వరకు ర్యాలీగా వచ్చిన కార్యకర్తలు లోపలికి చొచ్చుకుని వెళ్లేందుకు ప్రయత్నించగా.. వారిని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో అక్కడే రోడ్డుపై బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

ఇదీ చదవండి: పంచాయతీ కార్యదర్శి కోసం కదిలిన పల్లె జనం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.