ETV Bharat / state

పథకాలకు కోట్ల నిధులు కేంద్రమే ఇస్తోంది : బండి సంజయ్​ - భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్

కేంద్రం కోట్ల రూపాయల నిధులు ఇస్తుంటే తెరాస నేతలు తమ ఘనతగా చెప్పుకుంటున్నారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ విమర్శించారు. వరంగల్​లో వరదలోస్తే సాయం ఎందుకు చేయలేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఓరుగల్లులో రోడ్​ షో నిర్వహించారు.

BJP State president Bandi Sanjay
వరంగల్​లో బండి సంజయ్ ఎన్నికల ప్రచారం
author img

By

Published : Apr 24, 2021, 3:54 PM IST

కేంద్ర ప్రభుత్వ పథకాలతోనే వరంగల్ అభివృద్ధి చెందిందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. కోట్ల రూపాయల నిధులు కేందం ఇస్తుంటే... తెరాస నేతలు అది తమ ఘనతగా చెప్పుకుంటున్నారని విమర్శించారు. గ్రేటర్ వరంగల్ ఎన్నికల్లో కమలం అభ్యర్ధులను గెలిపించాలని కోరుతూ ప్రధాన రహదారిపై రోడ్​ షో నిర్వహించారు. మడికొండ నుంచి కాజీపేట, సుబేదారి మీదుగా కేయూ... హసన్‌పర్తి వరకు కొనసాగింది. కరోనా వైరస్ తీవ్రంగా వ్యాప్తి చెందుతున్నా... ముఖ్యమంత్రి కనీసం సమీక్ష కూడా చేయకుండా... కేంద్రంపై తప్పు నెట్టేస్తున్నారని ఆరోపించారు.

అబద్ధాలతో ప్రజలను తెరాస నేతలు మోసం చేస్తున్నారని బండి సంజయ్ మండిపడ్డారు. రైల్వే ఓవరాలింగ్ పరిశ్రమకు స్ధలం ఇంతకుముందే కేటాయించి ఉంటే...ఇప్పటికే 5వేల మందికి ఉపాధి లభించేదని తెలిపారు. హైదరాబాద్​లో వరద బాధితులకు 10 వేల రూపాయల పరిహారం అందించిన సర్కార్...వరంగల్​లో ఎందుకు అందించలేదని సంజయ్ ప్రశ్నించారు.

వరంగల్​లో బండి సంజయ్ ఎన్నికల ప్రచారం

ఇదీ చూడండి: సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణకు సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.