వరంగల్‌లో భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి తరుణ్‌చుగ్ పర్యటిస్తున్నారు. తొలుత భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో వారికి స్వాగతం పలికారు. కరోనా మహమ్మారి నుంచి విముక్తి కలిగించాలని ఓరుగల్లు భద్రకాళి అమ్మవారిని వేడుకున్నట్లు తరుణ్ చుగ్ తెలిపారు.
దేశ ప్రజలకు సంపూర్ణ ఆరోగ్యం కలిగించడంతో పాటు దేశాన్ని నడిపిస్తున్న ప్రధాని మోదీకి శక్తినివ్వాలని అమ్మవారిని ప్రార్థించినట్లు వివరించారు. కాసేపట్లో రాష్ట్ర ప్రధాన కార్యదర్శులతో బండి సంజయ్, తరుణ్‌చుగ్ భేటీ కానున్నారు.
ఇదీ చదవండి: ఒక్కొక్కరికి 2 డోసులు... దుష్ఫలితాల కట్టడికి మూడంచెల ఏర్పాట్లు