వరంగల్ నగరంలో భాజపా జెండా గద్దె కూల్చివేయడంపై భారతీయ జనతా పార్టీ నాయకులు ఆందోళనకు దిగారు. నగరంలోని 11వ డివిజన్ లేబర్ కాలనీలోని కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన జెండా కూల్చేశారని ధర్నా చేపట్టారు. అధికార తెరాస నేత బాబునే ఈ పని చేశారని ఆరోపించారు.
భాజపా ఎదుగుదల ఓర్వలేక తెరాస నేతలు ఇలాంటి ఘాతుకానికి పాల్పడుతున్నారని విమర్శించారు. జెండా కూల్చిన వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు. ఆందోళన సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు.
ఇదీ చూడండి: తెదేపా ఎమ్మెల్సీ బరిలో రమణ, సాగర్లో మువ్వా