ETV Bharat / state

ఆర్టీసీ ఆస్తులను కొల్లగొట్టాలని చూస్తే ఊరుకోం: లక్ష్మణ్​

హన్మకొండలో ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా భాజపా రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్​ పాల్గొని నిరసన తెలిపారు. వంటాపార్పు కార్యక్రమంలో కార్మికులకు భోజనం వడ్డించారు. ఆర్టీసీ ఆస్తులను కొల్లగొట్టాలని చూస్తే ఊరుకోమని హెచ్చరించారు.

ఆర్టీసీ ఆస్తులను కొల్లగొట్టాలని చూస్తే ఊరుకోం: లక్ష్మణ్​
author img

By

Published : Oct 20, 2019, 5:26 PM IST

హైకోర్టు ఆదేశాలను పట్టించుకోకుండా ముఖ్యమంత్రి కేసీఆర్‌ కొత్త రాజ్యాంగాన్ని సృష్టిస్తున్నాడని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌ వరంగల్‌లో ఆరోపించారు. ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మెకు మద్దతుగా ఆయన హన్మకొండలో ఆందోళనలో పాల్గొన్నారు. అమరవీరుల స్థూపం నుంచి ఏకశిలా పార్కు వరకు కార్మికులతో ర్యాలీగా వచ్చి వంటావార్పు కార్యక్రమంలో పాల్గొన్నారు. కార్మికులకు భోజనం వడ్డించారు. హైకోర్టు ప్రశ్నించినా.. ప్రభుత్వం మొద్దు నిద్రలో ఉందని ఎద్దేవా చేశారు. 16 రోజుల నుంచి సమ్మె చేస్తుంటే ముఖ్యమంత్రి కేసీఆర్‌ పట్టించుకోకపోవడం దుర్మార్గమైన చర్య అన్నారు. సంస్థ ఆస్తులను కొల్లగొట్టాలని చేస్తే తెలంగాణ జాతి ఊరుకోదని వ్యాఖ్యానించారు.

ఆర్టీసీ ఆస్తులను కొల్లగొట్టాలని చూస్తే ఊరుకోం: లక్ష్మణ్​

ఇవీ చూడండి: 'ధనిక రాష్ట్రంగా అప్పగిస్తే... అప్పుల కుప్పగా మార్చారు'

sample description
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.