ETV Bharat / state

భాజపా ఫ్లెక్సీలతో కాషాయమయంగా హనుమకొండ

BJP Flexis in Hanamkonda హనుమకొండ నగరం కాషాయమయంగా మారింది. బండి సంజయ్‌ చేపట్టిన మూడో విడత ప్రజా సంగ్రామ యాత్ర ఈరోజుతో ముగియనుంది. ఈ సందర్భంగా హనుమకొండలో ఆర్ట్స్ కళాశాల మైదానంలో నిర్వహిస్తున్న బహిరంగ సభకు నేతలు ఏర్పాట్లు పూర్తి చేశారు.

BJP Flexis in Hanamkonda
BJP Flexis in Hanamkonda
author img

By

Published : Aug 27, 2022, 1:14 PM IST

భాజపా ఫ్లెక్సీలతో కాషాయమయంగా మారిన హనుమకొండ

BJP Flexis in Hanamkonda: హనుమకొండ నగరం కాషాయమయంగా మారింది. భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ చేపట్టిన మూడో విడత ప్రజా సంగ్రామ యాత్ర ఈరోజుతో ముగియనుంది. ఈ సందర్భంగా హనుమకొండలో ఆర్ట్స్ కళాశాల మైదానంలో నిర్వహిస్తున్న బహిరంగ సభకు నేతలు ఏర్పాట్లు పూర్తి చేశారు. నగరంలో ఎటుచూసిన భాజాపా ఫ్లెక్సీలు దర్శనమిస్తున్నాయి. రోడ్డుకు ఇరువైపులా కాషాయ జెండాలు రెపరెపలాడుతున్నాయి.

BJP Public Meeting in Hanamkonda : హనుమకొండలోని ఆర్ట్స్ కళాశాల మైదానంలో జరిగే ప్రజాసంగ్రామయాత్ర ముగింపు బహిరంగ సభకు భాజాపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా హజరుకానున్నారు. ప్రత్యేక హెలికాప్టర్​లో మధ్యాహ్నం 2.40 వరకు నడ్డా వరంగల్​కు చేరుకోనున్నారు. ఆనంతరం 3 గంటలకు భద్రకాళి అమ్మవారి దర్శించుకోనున్నారు. ఆనంతరం హనుమకొండలోని బాలసముద్రంలో కాకతీయ విశ్వవిద్యాలయం విశ్రాంత ఆచార్యులు వెంకట్ నారాయణ ఇంటికి వెళ్లనున్నారు.

వెంకట్ నారాయణతో జేపీ నడ్డా తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించనున్నారు. ఈ సందర్భంగా తెలంగాణలో జరుగుతున్న పరిస్థితులపై ఆయనకు వివరిస్తానని వెంకట్ నారాయణ తెలిపారు. సాయాంత్రం నాలుగు గంటలకు సభకు హజరై 6 గంటలకు తిరిగి హెలికాప్టర్‌లో హైదరబాద్​కు వెళ్లనున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.