తెలంగాణ విమోచన దినోత్సవాన్ని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని భాజపా వరంగల్ అర్బన్జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ డిమాండ్ చేశారు. దేశానికి ఆగస్టు 15న స్వాతంత్య్రం వస్తే రాష్ట్రానికి సెప్టెంబరు 17న వచ్చిందన్నారు. ఉద్యమ సమయంలో విమోచన దినోత్సవాన్ని అధికారకంగా నిర్వహిస్తామన్న తెరాస నేతలు పదవిలోకి వచ్చిన తర్వాత ఆ విషయాన్ని విస్మరించారని ఆరోపించారు.
తెలంగాణ చరిత్ర భవిష్యత్ తరాలకు తెలియజేయడంలో ఈ వేడుక ఎంతో కీలక పాత్ర వహిస్తోందన్నారు. ప్రభుత్వం అధికారకంగా నిర్వహించేవరకు భాజపా ఉద్యమిస్తునే ఉంటుందని పేర్కొన్నారు.