ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని కార్మికులు చేస్తున్న సమ్మె 14 రోజులకు చేరింది. ఈ సందర్భంగా కాజీపేట రైల్వేస్టేషన్ నుంచి హన్మకొండ ఏకశిలా పార్క్ వరకు విశ్రాంత ఉద్యోగులు, ఆర్టీసీ ఉద్యోగులు పెద్ద ఎత్తున బైక్ ర్యాలీ నిర్వహించారు. ఆర్టీసీ కార్మికుల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి వీడకుంటే ప్రభుత్వ పతనం ఖాయమని కార్మికులు హెచ్చరించారు.
ఇదీ చూడండి : "రేపటి ఆర్టీసీ బంద్‌లో ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొనాలి"